‘HHVM’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే బాక్సాఫీస్ అంచనా ఎన్ని కోట్లు? పవన్ ముందున్న టార్గెట్ ఇదే..

‘HHVM’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత.. ఫస్ట్ డే బాక్సాఫీస్ అంచనా ఎన్ని కోట్లు? పవన్ ముందున్న టార్గెట్ ఇదే..

పవన్ కల్యాణ్ నుంచి దాదాపు మూడేళ్ల తర్వాత ‘హరిహర వీరమల్లు’ థియేటర్లలోకి వచ్చింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ పెయిడ్ ప్రీమియర్స్‌ను బుధవారం రాత్రే తెలుగు రాష్ట్రాల్లో వేశారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్‌లో VFX అస్సలు బాలేదని.. అవి ప్రేక్షకుల్ని డిస్సప్పాయింట్ చేసేలా ఉందని అంటున్నారు. ఓవరాల్గా ఫస్టాఫ్ 40 నిమిషాలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, కీరవాణి మ్యూజిక్ సినిమాని నిలబెట్టేలా ఉన్నాయని రివ్యూలు ఇస్తున్నారు. 

అయితే, ఈ క్రమంలోనే వీరమల్లు ఫస్ట్ డే ఎలాంటి ఓపెనింగ్ సాధిస్తుందనేది ఆసక్తిగా మారింది. అంతేకాకుండా సినిమా బడ్జెట్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్? వివరాలపై కూడా ఆడియన్స్ ఓ లుక్కేస్తున్నారు. మరి వీరమల్లు వరల్డ్ వైడ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?  నైజాంలో ఎంత చేసింది? మిక్సెడ్ టాక్ మధ్య అంచనాలు అందుకోనుందా? లేదా అనేది చూసేద్దాం

వీరమల్లు ఫస్ట్ డే బాక్సాఫీస్ అంచనా:

హరిహర వీరమల్లు మూవీ ఫస్ట్ డే టాక్ బాగుంటే.. రూ.30 కోట్ల నెట్ ఓపెనింగ్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా 2025లో టాలీవుడ్ లో సెకెండ్ ఓపెనింగ్స్ సాధించే మూవీగా నిలిచే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది.  

2025లో టాప్ 5 ఓపెనర్లు:

గేమ్ ఛేంజర్- రూ.54 కోట్లు

డాకు మహారాజ్- రూ.25.35 కోట్లు

సంక్రాంతికి వస్తున్నాం- రూ.23 కోట్లు

హిట్: ది థర్డ్ కేస్- రూ.21 కోట్లు

కుబేరా- రూ.14.75 కోట్లు

బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్:

దాదాపు రూ.250కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన వీరమల్లు సినిమాను.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మించారు. ఈ క్రమంలో సినిమా అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.102 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.

ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియాలలో కలుపుకుని రూ.12.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.10 కోట్ల చొప్పున వరల్డ్ వైడ్‌గా రూ.126 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇది పవన్ కెరియర్లోనే అత్యధికంగా బిజినెస్ చేసిన మూవీగా నిలిచింది. 

ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు:

నైజాం- రూ.37 కోట్లు
సీడెడ్- రూ.16.50 కోట్లు
ఉత్తరాంధ్ర- రూ.12 కోట్లు
ఈస్ట్ గోదావరి- రూ.9.50 కోట్లు
వెస్ట్ గోదావరి- రూ.7.00 కోట్లు
గుంటూరు- రూ.9.50 కోట్లు
కృష్ణ- రూ.7.60 కోట్లు
నెల్లూరు- రూ.4.40 కోట్లు
ఓవర్సీస్- రూ.10 కోట్లు
రెస్టాఫ్ ఇండియా- రూ.12.50 కోట్లు. 

ఇలా ఈ లెక్కన చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాలలో వీరమల్లు లాభాల్లోకి రావాలంటే రూ.103కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.210 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.127 నుంచి 130 కోట్ల షేర్.., రూ. 250 కోట్ల నుంచి 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

అయితే, ప్రస్తుతానికి.. వీరమల్లు అడ్వాన్స్ బుకింగ్స్‌లో, పెయిడ్ ప్రీమియర్స్ తో మంచి ఓపెనింగ్ సాధించిందని టాక్. ఇవాళ సాయంత్రం లోపు అన్నీవర్గాల నుంచి వచ్చే టాక్ బట్టి సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. చూడాలి మరి.. చివర్లో పవన్ కళ్యాణ్ వచ్చి చేసిన ప్రమోషన్స్ ఏ విధంగా పనిచేశాయనేది!