
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్లాక్ సూట్, బ్లాక్ టోపీ, బ్లాక్ షూస్‌తో స్టైలిష్ గెటప్‌లో ఇంప్రెస్ చేశారు పవన్. ఒకప్పటి పవన్ కళ్యాణ్ వింటేజ్ స్వాగ్‌ను గుర్తుచేస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ సినిమాలోని ఓ పాట స్టిల్‌తో అభిమానులందరికీ బర్త్‌డే గిఫ్ట్‌ను ఇచ్చాడు హరీష్ శంకర్. ఇక సెప్టెంబర్ 6నుంచి ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని, ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర నటీనటులంతా జాయిన్ అవుతారని మేకర్స్ చెప్పారు. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ దాదాపు పూర్తవుతుందని అన్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పార్థిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్, నాగ మహేశ్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పవన్, హరీష్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రూపొందుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.