
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పటికే ఆయన నాలుగైదు సినిమాలకు కమిట్ అవడం, కొంత భాగం షూటింగ్స్ కూడా పూర్తి చేయడంతో బ్యాలెన్స్ షూట్ కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. తాజాగా ఆయన షూటింగ్‌కు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సెట్స్‌కు వెళ్లి వీలైనంత ఫాస్ట్‌గా సినిమాలను కంప్లీట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారట.
రీసెంట్‌గా ఆయా చిత్ర నిర్మాతలు పవన్‌ను కలవగా, షూటింగ్‌కు ప్లాన్ చేయమని చెప్పినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో జాయిన్ అవుతారని, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పాడు. అలాగే ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.
షూటింగ్స్ కోసం కొన్ని రోజులు కేటాయించి గ్యాప్ లేకుండా ముందుగా ఆయన పోర్షన్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేయాలని మేకర్స్‌కు పవన్ సూచించినట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే.. పవన్ కళ్యాణ్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకువచ్చే చాన్స్ ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘గబ్బర్ సింగ్’ ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం థియేటర్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.