మరోసారి పవన్ కళ్యాన్ ఖుషి సినిమా విడుదల

మరోసారి పవన్ కళ్యాన్ ఖుషి సినిమా విడుదల

పవన్ కళ్యాణ్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందనుంది. ఏప్రిల్ 27, 2001లో రిలీజ్ అయిన ఖుషి సినిమా అప్పట్లో రికార్డ్ కలెక్షన్స్ సృష్టించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 31న రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఆ చిత్ర బృందం ప్రకటించింది. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పటికే పలువురు హీరోల సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి మళ్లీ రికార్డుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే, 21 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాబోతున్న పవన్ సూపర్ హిట్ సినిమాపై భారీ అంచనాలు వెలువడుతున్నాయి. మరొకసారి భారీ కలెక్షన్స్ రాబడుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాన్, భూమికతో తెరకెక్కిన ఈ లవ్ స్టోరీకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీ 4కే రిజల్యూషన్, డాల్బీ ఆడియోతో రాబోతుంది. ఈ వార్తతో పవన్ అభిమానుల్లో ఖుషీగా ఫీలవుతున్నారు.