TheyCall HimOG: ఓజీ క్రేజీ అప్డేట్..హంగ్రీ చీతా దూకుడు సిద్ధం..

TheyCall HimOG: ఓజీ క్రేజీ అప్డేట్..హంగ్రీ చీతా దూకుడు సిద్ధం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ (OG). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ సిజీత్(Sujeeth) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

పవన్ నుండి వస్తున్న సినిమాల్లో ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఏర్పడింది. దానికి కారణం ఈ సినిమాలో పవన్ మొదటిసారి గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నారు. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రేండింగ్ లోకి వస్తోంది. 

ALSO READ | Dhanush: హీరోగా - దర్శకుడిగా ధనుష్ 52వ ప్రాజెక్ట్ అనౌన్స్..వివరాలివే

తాజాగా ఈ మూవీ టీమ్ ఓ అప్డేట్ షేర్ చేసింది. దీన్ని యూకేలో డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ (DreamZ Entertainment ) విడుదల చేయనున్నట్టు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది. 

ఇకపోతే..ఈ మూవీలో ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్ అనుకున్నారు అంతా..కానీ, ఓజి అంటే 'ఓజాస్ గంభీర' అని తెలిసింది.ఇక ఈ పేరే టైటిల్గా పెడితే పవర్ ఫుల్గా అనుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు మరో టైటిల్ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. హంగ్రీ చీతా (Hungry Cheetah) అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది

ప్రొడ్యూసర్ DVV దానయ్య  నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా..తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das), శ్రియ రెడ్డి (Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్గా నటిస్తున్నాడు.అయితే ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి27న రీలీజ్ చేయనున్నట్టు సమాచారం.