
పవర్ స్టార్.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ OG మూవీ ధియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ మానియా నడుస్తుంది. OG కిక్ లో ఉన్న ఫ్యాన్స్ సంబరాల్లో ఉన్నారు. కాకపోతే ఒకే ఒక్క చిన్న లోటు ఉంది OG సినిమాపై అదే A సర్టిఫికెట్.. A సర్టిఫికెట్ రావటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్.. పిల్లలతో సినిమా చూద్దాం అనుకున్న వాళ్లు డిస్ అపాయింట్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లందరికీ గుడ్ న్యూస్.. త్వరలో OG మూవీ OTTలోకి రాబోతుందన్న విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రముఖ OTT ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ .. OG మూవీకి కొనుగోలు చేసిందంట. భారీ ఆఫర్.. ఏకంగా 80 కోట్ల రూపాయలకు Netflix దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ ఆఫర్ తో OG మూవీని దక్కించుకున్న Netflix.. ఎక్కువ సమయం వెయిట్ చేయకుండా.. మూవీపై హీట్ తగ్గక ముందే రిలీజ్ చేయాలనే తాపత్రయంలో ఉందంట..
వచ్చే పండక్కి.. అంటే దీపావళికి OGని OTTలో రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీ టాక్. దీపావళి పండగ అక్టోబర్ 20వ తేదీ.. అంటే అప్పటికి మూవీ రిలీజ్ అయ్యి దాదాపు నెల రోజులు అవుతుంది. నాలుగు వారాలు అటూ ఇటుగా.. ఈలోపు ఎటూ ధియేటర్లలో హీట్ తగ్గిపోతుంది. భారీ దసరా సెలవుల తర్వాత ధియేటర్ల రష్ ఎటూ ఉండదు.. ఈ క్రమంలోనే రాబోయే దీపావళి రోజున OGని గ్రాండ్ గా OTTలోకి రాబోతుందంట.
A సర్టిఫికెట్ వల్ల డిస్ అపాయింట్ అయిన పవన్ ఫ్యాన్స్, పిల్లలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ కదా..