
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pwan kalyan) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన హీరోగా వస్తున్న ఓజీ(OG) మూవీ టీజర్ గురించి ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ వైటింగ్స్ పులిష్టాప్ పెడుతూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఓజీ మేకర్స్. ఓజీ ఈ సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటెర్టైమెంట్స్ సంస్థ.. రేయ్.. ఆగండి.. అన్ని పేల్తాయి.. యూ కన్ ఎక్స్పెక్ట్ నెవర్ బిఫోర్ హై ఆన్ సెప్టెంబర్ 2 అంటూ ఒక వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేసింది.
ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. కాబట్టి ఆరోజు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ మూవీ నుండి అప్డేట్ ఇవ్వనున్నారు అని క్లియర్ గా అర్థమవుతోంది. ఈ అప్డేట్ కోసం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆరోజు టీజర్ రిలీజ్ కానుందని, ఆ టీజర్ 72 సెకండ్స్ ఉండనుందని, దానికి అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఈ టీజర్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
Reyyy… Aagandi… Anni Pelathaayi… ??
— DVV Entertainment (@DVVMovies) August 27, 2023
You can expect NEVER BEFORE HIGH on Sept 2nd!! pic.twitter.com/PmV6is0prE
నిజానికి ఓజీ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐన క్షణాల్లో వైరల్ ట్రేండింగ్ లోకి వస్తోంది. ఇక తాజాగా ఈ న్యూస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ఫ్యాన్స్ కూడా సెప్టెంబర్ 2న రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆరోజు ఓజీ అప్డేట్ తో సోషల్ మీడియా మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే సాహో దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తాన్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ గ్యాంగ్ స్టార్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహన హీరోయిన్ గ నటిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, ఇమ్రాన్ హస్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఓజీ నుండి ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ అభిమానులతో సహా కామన్ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.