పవన్ కు తీవ్ర జ్వరం - ప్రచారం వాయిదా..

పవన్ కు తీవ్ర జ్వరం - ప్రచారం వాయిదా..

ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన క్రమంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్ ప్రచారం నిర్వహిస్తుండగా ప్రజాగళం పేరిట చంద్రబాబు, వారాహి విజయభేరి పేరిట జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటీవలే పిఠాపురం నుండి ప్రచారాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు తిరగక ముందే ప్రచారానికి బ్రేక్ వేశాడు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన పవన్ కు తీవ్ర జ్వరం రావటంతో ప్రచారానికి బ్రేక్ ఇచ్చి చికిత్స కోసం హైదరాబాద్ చేరుకున్నాడు.

పవన్ కళ్యాణ్ కు జ్వరం తీవ్రంగా ఉందని, విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో ఇవాళ తెనాలిలో నిర్వహించాల్సిన వారాహి విజయభేరి సభతో పాటు ఉత్తరాంధ్ర పర్యటన కూడా వాయిదా వేసుకున్నాడు పవన్. కనీసం రెండు మూడురోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించిన నేపథ్యంలో విశ్రాంతి తర్వాత పర్యటనను రీషెడ్యూల్ చేసి పునః ప్రారంభిస్తారని జనసేన రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు.