HariHaraVeeraMallu: ‘హరిహర వీరమల్లు’ థర్డ్ సింగిల్ స్పెషల్.. కీరవాణి ప్రతిభను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

HariHaraVeeraMallu: ‘హరిహర వీరమల్లు’ థర్డ్ సింగిల్ స్పెషల్.. కీరవాణి ప్రతిభను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. ఎన్నాళ్ళు మౌనంగా ఉన్న మేకర్స్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ప్రమోషన్స్ తో ముందుకొస్తున్నారు.

లేటెస్ట్గా పవన్ కల్యాణ్ చిత్ర సంగీత దర్శకుడు కీరవాణిని కలిసి సన్మానించారు. ‘అసురుల హననం’పేరుతో రానున్న మూడో పాట విడుదల సందర్భంగా వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం స్టూడియోలో పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటోలను పంచుకుంది. 

ALSO READ | War2Teaser: వార్ 2 టీజర్ రిలీజ్.. హాలీవుడ్‌ను మించిపోయేలా తారక్ యాక్ష‌న్ సీక్వెన్స్‌

" ఒక సంగీత నివాళి! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆస్కార్-విజేత సంగీత స్వరకర్త కీరవాణికు నివాళులర్పించారు. కీరవాణి హరిహర వీరమల్లు సౌండ్‌ట్రాక్ వెనుక ఉన్న ఆత్మ అంటూ " మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు. అలాగే హీరో పవన్ కళ్యాణ్ “మీతో కలిసి పనిచేయడం నాకిదే మొదటిసారి, కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉండాలి” అని పవన్ కోరారు. 

హరిహర వీరమల్లు మూడో పాట రేపు 21న ఉదయం 11:55గంటలకు రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో సాంగ్స్ ప్రేక్షకాదరణ పొందాయి. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఫస్ట్ టైం నటిస్తున్న పాన్ ఇండియా మూవీది. పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీని రెండు భాగాలుగా రూపొందించారు. ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మొదటిభాగం తెరకెకిక్కించారు. జూన్ 12న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.