War2Teaser: వార్ 2 టీజర్ రిలీజ్.. హాలీవుడ్‌ను మించిపోయేలా తారక్ యాక్ష‌న్ సీక్వెన్స్‌

War2Teaser: వార్ 2 టీజర్ రిలీజ్.. హాలీవుడ్‌ను మించిపోయేలా తారక్ యాక్ష‌న్ సీక్వెన్స్‌

మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే స్పెషల్ ట్రీట్ వచ్చేసింది. నేడు (మే20న) తారక్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ భాష‌ల్లో ఈ టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు.

'నా కళ్ళు నిన్ను ఎప్పట్నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్.. ఇండియా బెస్ట్ సోల్జర్.. రా లో బెస్ట్ ఏజెంట్ నువ్వే.. కానీ, ఇప్పుడు కాదు' అంటూ ఎన్టీఆర్ ఎంట్రీలోనే చెప్పిన డైలాగ్ పవర్ ఫుల్గా ఉంది. 'నీకు నా గురించి తెలియదు.. ఇప్పుడు తెలుసుకుంటావ్.. గెట్ రెడీ ఫర్ వార్..' అంటూ హృతిక్తో తారక్ దండయాత్ర మొదలు పెట్టిన విధానం అంచనాలు పెంచేసింది. 

నెవెర్ బిఫోర్ అనేలా..హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలలో ఎన్టీఆర్ అదరగొట్టాడు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇది కదా అసలైన బాలీవుడ్ అరంగేట్రం అంటే అని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ తో సోషల్ మీడియా షేక్ చేస్తున్నారు. 

వార్ 2 గురించి:

యాక్షన్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్కు ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో ఇండియన్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తుండటంతో  ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటం, సూపర్ హిట్ 'వార్' సినిమాకు సీక్వెల్గా 'వార్ 2'(War2) వస్తుండటం సినీ వర్గాల్లో అంచనాలు పెరిగాయి.

YRK స్పైవర్స్ లో భాగమైన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరియు కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న వెండితెరపైకి రానుంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి  దేవర2 కాగా రెండవది బాలీవుడ్ లో చేస్తున్న వార్2. మూడవది ప్రశాంత్ నీల్ తో NTR 31. దేవర 2 వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పై వెళ్లనుందని టాక్. ఇక ఉన్న ఈ రెండు సినిమాల్లో వార్ 2 మూవీపై ఇండియా వైడ్గా భారీ అంచనాలున్నాయి. నీల్ సినిమాపై ఇంటెర్నేషనల్ వైడ్ గా అంచనాలు ఆకాశాన్ని చేరాయి.