
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా ప్రజా సేవలో ఆయన బిజీ అవడంతో ఇకపై సినిమాలు చేస్తారా లేదా అనే సందేహాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు, ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న సినిమాలు పవన్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉప్పాడలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. తన సినిమాల గురించి శుభవార్త చెప్పారు. ‘ఓజీ... ఓజీ...’ అంటూ అభిమానులు అడగడంతో పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు.
‘‘ఓజీనా.. సినిమాలు చేసే టైమ్ ఉందంటారా... నిన్ను ఎన్నుకుంటే ‘ఓజీ’ అని సినిమాలు చేస్తావా.. క్యాజీ అంటే ఏం చెప్పను.. మా ప్రజలకు సేవ చేసుకుని కుదిరినప్పుడు రెండు, మూడు రోజులు షూటింగ్స్ చేస్తా అని మా నిర్మాతలకు కూడా చెప్పాను. ‘ఓజీ’ చూద్దురు గానీ బాగుంటుంది’’ అని పవన్ అన్నారు. కనీసం రోడ్లు అయినా వేయలేదని, గుంతలైనా పూడ్చలేదని ప్రజలు నన్ను తిట్టకూడదు కదా.. ముందు మూడు నెలలు ఎక్కువగా ప్రజాసేవపై దృష్టి పెడతానని పవన్ వెల్లడించారు. ‘ఓజీ’ చిత్రంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు సినిమాల షూటింగ్స్‌ను పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.