YCP నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తా

YCP నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తా

YCP ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. YCP నాయకులకు డబ్బు, అధికారం, అహంకారం అన్ని ఉన్నాయి ఒక్క భయం తప్ప.. ఖచ్చితంగా భయం అంటే ఏంటో చూపిస్తానని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

నేను పద్దతిగా సంస్కారవంతంగా ఉంటే YCP వారికి నచ్చట్లేదన్న పవన్ కళ్యాణ్..బూతులు మాట్లాడాలి అనుకుంటే నేను మీకంటే బాగా మాట్లాడతాను...నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? అని అన్నారు. నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను.. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా అని అన్నారు.

YCP అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారన్న పవన్.. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారన్నారు. YCP నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా అని అన్నారు. తాను ఒకటి మాట్లాడితే.. వైసీపీ వాళ్లు మరొకటి మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ని ఎవరు హత్య చేసారమ్మా అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 YCP  గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని అన్నారు జనసేనాని. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతానన్న పవన్..కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదన్నారు.