నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు.. అవసరమైతే తిప్పికొట్టండి: ఫ్యాన్స్ కు పవన్ పిలుపు

నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు.. అవసరమైతే తిప్పికొట్టండి: ఫ్యాన్స్ కు పవన్ పిలుపు

‘నా జీవితంలో ఏది అంత తేలిగ్గా రాదు.. ప్రతి విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. మనం డిప్యూటీ సీఎం కదా.. ఈ సినిమా ఈజీగా రిలీజ్ అవుతుంది కదా అనుకున్నా.. కానీ అలా రిలీజ్ అవలేదు’ అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురువారం విడుదలై మంచి రెస్పాన్స్‌‌ను తెచ్చుకుందని టీమ్ తెలియజేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నా సినీ కెరీర్‌‌‌‌లో  ఈ సినిమా కోసం చేసిన ప్రమోషన్స్ దేనికీ చేయలేదు. 

ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రికార్డులు, కలెక్షన్స్ నేనెప్పడూ పట్టించుకోను. ఎందుకంటే నేను  సక్సెస్‌‌లను  తలకెక్కించుకోను. నా ఫస్ట్ పీరియాడికల్ మూవీ ఇది.  అందర్నీ ఎంగేజ్ చేసే స్టోరీ అని కథ విన్నప్పుడే అనుకున్నా.  హిస్టరీ గురించి  చెప్పాలంటే రెండు భాగాలు తప్పనిసరి అయ్యింది. కొందరు ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూలు ఇస్తామని చెబుతున్నారు. అలాంటివి చేసినా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నెల్లూరు చిన్న వీధుల్లో పెరిగిన నాకు ఈ స్థాయిలోకి రావడమే గొప్ప. నా సినిమాను ఆపుతున్నారంటే నా ఎదుగుదల ఏంటో   వాళ్లే చెబుతున్నారు. 

మనం బలంగా ఉన్నాం కాబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. ఎవరు ఎన్ని చేసినా.. ‘హరిహర వీరమల్లు’ టార్గెట్ అచీవ్ అయ్యింది. ఏమైనా లోపాలు ఉంటే పార్ట్‌‌2లో సరిచేసుకుంటాం. నెగిటివ్‌‌ కామెంట్స్‌‌ను పట్టించుకోవద్దని ఫ్యాన్స్‌‌కు చెబుతున్నా. అవసరమైతే తిప్పికొట్టండి’ అని అన్నారు.  తన కెరీర్‌‌‌‌లో ఇది స్పెషల్ మూవీ అని నిధి అగర్వాల్ చెప్పింది.  ఈ చిత్రం తనకు లైఫ్ చేంజింగ్ మూమెంట్ అని దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పాడు.  ఇదొక చరిత్ర అని, సినిమాకు రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇస్తోందని నిర్మాత ఏఎం రత్నం అన్నారు. ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయని,  రికార్డ్ కలెక్షన్స్ చూడబోతున్నామని రిలీజ్ చేసిన నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ అన్నారు.