
- YSR పేరు ఆ పార్టీకి ఎందుకో వారే చెప్పాలి
- కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును స్వాగతిస్తున్నా
అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును స్వాగతిస్తున్నామని తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని.. అంబేద్కర్ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును స్వాగతిస్తున్నామని శుక్రవారం ప్రకటించారు. ఒకే పార్టీలో రెండువర్గాల గొడవను కులఘర్షణగా మార్చారని.. కోనసీమ తగులబడుతుంటే బస్సు యాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని తెలిపారు. ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందని.. సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్ విధానం అన్నారు. ఏపీలో మళ్లీ వైసీపీ సర్కార్ వస్తే అరాచకమేనని.. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. YSR ప్రభుత్వంలో Y అంటే యువజనులకు ఉపాధి లేదు. S అంటూ శ్రామికులకు ఉన్నపని తీసేశారు. R అంటే రైతులకు మద్దతుధర లేదు. ఇక YSR పేరు ఆ పార్టీకి ఎందుకో వారే చెప్పాలి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నంతకాలం పోలవరం పూర్తికాదన్న పవన్.. కేంద్రం సొమ్మును ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
మరిన్ని వార్తల కోసం...