
ఏపీ సర్కార్ పై మరోసారి ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా రోడ్లపై ట్వీట్ చేశారు. ఏపీలో రహదారులు నరకపు దారులుగా మారాయని ట్విట్ చేశారు. రహదారులపై నిలువెత్తు గోతులున్నా వైసీపీ ప్రభుత్వానికి పట్టదని ఆరోపించారు. అందుకే మరమ్మతుల బాధ్యతను జనసేన చేపట్టిందన్నారు. ద్వారపూడి, మండపేట రహదారిలో 2 కి.మీ. మేర మరమ్మతులు చేశాన్నారు. జనసేన నేతలు, సైనికులకు అభినందనలను తెలిపారు పవన్.