
మానవ హక్కుల ఉల్లంఘన అధికంగా రాయలసీమలోనే ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమ వెనుకబాటుతనం, సీఎం జగన్ గురించి ఈ ఉదయం పవన్ వరుస ట్వీట్లు చేశారు. రాయలసీమలోనే,దళిత కులాల మీద దాడులు జరిగిన, బయటకి వచ్చి చెప్పటానికి భయపడతారన్నారు. ఇంకా మిగతా వారు ముఠాలు చెప్పింది మౌనంగా వినటమే తప్ప చేసేదేమి లేదన్నారు. పోరాట యాత్రలో తనతో యువత వారి బాధలు చెబుతుంటే గుండె కలిచి వేసిందన్నారు.
1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వస్తాయన్నారు పవన్. రాయలసీమ నుంచి ఇంత మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎందుకు వెనకబడిందనేది ఈ పుస్తకం చదివితే తెలుస్తుందన్నారు. సీఎం జగన్ గురించి పుస్తకంలోని 75 పేజీలో జగన్ ప్రస్తావన ఉందంటూ‘ట్వీట్ చేశారు.
1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. pic.twitter.com/2pNalKgUvt
— Pawan Kalyan (@PawanKalyan) November 25, 2019