
రీమేక్ సినిమా మోషన్ పోస్టర్ తో పాన్ ఇండియా రికార్డ్స్ లేపేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ "బ్రో". తమిళ సినిమా వినోదయ సీతమ్ కు ఇది రీమేక్. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను తమిళ దర్శకుడు,నటుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. అయితే.. తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ మోషన్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ పోస్టర్ రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇంతకుముందు ఆర్ఆర్అర్ 4.5, రాధే శ్యామ్ 4.75 మిలియన్ వ్యూస్ ను రాబట్టాయి. అయితే.. ఈ వ్యూస్ వాటి లైఫ్ టైంలో వచ్చినవి. కానీ బ్రో మాత్రం వాటి లైఫ్ టైం వ్యూస్ ను కేవలం 24 గంటల్లో క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటా అని మరోసారి ప్రూవ్ అయ్యింది.
ఈ రేర్ రికార్డ్ తో పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎప్పటికైనా గాడ్ ఆఫ్ మాస్ అంటే పవన్ కళ్యాణే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మోషన్ పోస్టర్ తోనే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.