
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'OG' ( 'They Call Him OG') . సెప్టెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా... ప్రపంచ వ్యాప్తంగా రూ. 293 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో అభిమానులను ఉర్రూతలు ఊగించిన ఈ మూవీ ఇప్పుడు OTT లో అలరించేసేందుకు రెడీ అయింది.
థియేటర్లలో రిలీజైన నెల రోజు కూడా కాక ముందే.. ఈ చిత్రాన్ని ఇప్పుడు పవన్ 'OG' ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 23 నుంచి నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాంతార చాప్టర్ 1 థియేటర్లలో విడుదల తర్వాత .. చాలా చోట్ల ఓజీ సినిమాను తొలగించారు. దీంతో ఆశించినంత స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. కొన్ని చోట్ల ఓజీ బయ్యర్లకు నష్టాలు కూడా మిగిల్చిందని టాక్ వినిపిస్తోంది.
Also Read : దివ్వెల మాధురిపై నాగార్జున ఫైర్.. 'సూపర్ పవర్' కట్.. తీరు మార్చుకో.. !
Mumbai Vasthunna…. Thalalu Jagratta 🔥#OG on @NetflixIndia from Oct 23rd…#TheyCallHimOG pic.twitter.com/BerySBkJ4y
— DVV Entertainment (@DVVMovies) October 18, 2025
'OG' చిత్రంలో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మి విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా, పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాల ప్రణాళికలో 'OG' సీక్వెల్, ప్రీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, సుజిత్ దీనిపై క్లారిటీ కూడా ఇచ్చేశారు..