Pawan Kalyan: OG' బాక్సాఫీస్ సునామీ: 'పుష్ప 2' రికార్డు బద్దలు – పవర్ స్టార్ కొత్త బెంచ్‌మార్క్!

Pawan Kalyan: OG' బాక్సాఫీస్ సునామీ: 'పుష్ప 2' రికార్డు బద్దలు – పవర్ స్టార్ కొత్త బెంచ్‌మార్క్!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ బాక్సాఫీస్ వద్ద తన సునామీని మరోసారి నిరూపించుకుంటున్నారు. ఆయన లేటెస్ట్ చిత్రం, యాక్షన్ థ్రిల్లర్ ' OG (They Call Him OG)' రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కల్యాణ్‌కు ఉన్న  స్టార్‌డమ్ ముందు గతంలో ఉన్న రికార్డుల లెక్కలు తారుమారైయ్యాయి. టికెట్ విండోల వద్ద ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేస్తోంది. ఈ దశాబ్దంలో పవన్ కల్యాణ్ సినిమాల్లో అత్యంత అంచనాలు ఉన్న చిత్రంగా 'OG' నిలిచింది.  ప్రీమియర్ షోల ద్వారా అత్యధిక కాసుల వర్షంతో సంచలనం సృష్టించింది.

 బాక్సాఫీస్ వద్ద 'OG' ప్రభంజనం

ప్రీమియర్ వసూళ్ల ట్రెండ్‌లను పరిశీలిస్తే, అల్లు అర్జున్ నటించిన అత్యంత భారీ చిత్రం 'పుష్ప 2' సాధించిన రికార్డులను సైతం 'OG' భారీ అలవోకగా బ్రేక్ చేస్తోంది.  గ్రాస్ (Gross) వసూళ్ల పరంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఓపెనింగ్ డే వైపు 'OG' దూసుకెళ్లింది. దీంతో పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేసి స్టార్ హీరోలకు కొత్త ఓపెనింగ్స్ కలెక్షన్ల బెంచ్ మార్కును పవన్ కళ్యాణ్ సృష్టిస్తున్నారు.

ఓవర్సీస్ లో సరికొత్త రికార్డు

నైజాం ప్రాంతంలో మొత్తం 366+ షోలు పూర్తిగా అమ్ముడయ్యాయి. ఇది ఒక తెలుగు చిత్రానికి ప్రీమియర్‌లకు వచ్చిన అత్యధిక సేల్స్ లో రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 24, 2025న ప్రీమియర్ అయిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్‌లో ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.   విదేశీ మార్కెట్‌లోనూ 'OG' హవా నడుస్తోంది. నార్త్ అమెరికన్ స్క్రీనింగ్‌ల ద్వారా ఈ చిత్రం 3 మిలియన్ డాలర్లకు ( రూ.27 కోట్లు ) పైగా  వసూళ్లు రాబట్టింది. ఇది తెలుగు చిత్రాల ప్రీమియర్ చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో ఓవర్సీస్ లో కల్కీ రికార్డులను కూడా పవన్ ఓజీ క్రాస్ చేసింది.

 

 పవన్ కల్యాణ్ నటన, స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయని, ఎస్.ఎస్. తమన్ అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రాణం పోసిందని అభిమానులు ప్రశంసించారు. విశ్లేషకులు కూడా సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.  డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్ స్టార్‌డమ్ , ట్రేడ్ అనలిస్టుల అంచనాల నేపథ్యంలో, 'దే కాల్ హిమ్ OG' మొదటి రోజు వసూళ్లలో మరిన్ని సరికొత్త రికార్డులను నెలకొల్పనుందని అంచనా వేస్తున్నారు.