ఆన్‏లైన్‏లో వకీల్ సాబ్ ఫుల్ మూవీ లీక్

ఆన్‏లైన్‏లో వకీల్ సాబ్ ఫుల్ మూవీ లీక్

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ శుక్రవారం విడుదైంది. మంచి కథ, కథనంతో అందర్నీ ఆకట్టుకునేలా ఉందని మూవీకి ప్రశంసలు దక్కుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ గోలలతో థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. ఈ విషయాన్ని అటుంచితే.. వకీల్ సాబ్ ఫుల్ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ కావడం హాట్ టాపిక్ గా మారింది. తమిళ్ రాకర్స్, టెలిగ్రాం, మూవీ రూల్స్ లాంటి ప్లాట్ ఫామ్స్ లో వకీల్ సాబ్ ఫుల్ హెచ్ డీ ప్రింట్ అందుబాటులో ఉన్నాయని తెలిసింది. ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందించారు. పైరసీని ప్రోత్సహించొద్దని, అలాంటి సైట్లు, ప్లాట్ ఫామ్ ల మీద ముందుకొచ్చి blockxpiracy.comలో రిపోర్టు చేయాలని వకీల్ సాబ్ ను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ లో కోరింది.