పవన్​ తండ్రిగా బాలీవుడ్​ స్టార్

 పవన్​ తండ్రిగా  బాలీవుడ్​ స్టార్

పవన్​ కల్యాణ్​ హీరో (Pawan Kalyan)గా ‘OG’(Orginal Gangstar) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సుజీత్​(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​ హీరో ఇమ్రాన్​ హష్మి ఈ సినిమాలో కీలక  పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 

తాజాగా మరో క్రేజీ బజ్​ సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ను(Amitabh Bachchan) పవన్​ తండ్రిగా నటింపజేయనున్నట్టు తెలుస్తోంది. ఈ రోల్​ చాలా పవర్ఫుల్​గా ఉండనుందట. ఇప్పటికే ఈ విషయమై మూవీ టీం అమితాబ్​తో సంప్రదింపులు జరుపుతోందని త్వరలోనే అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఉండనుందని సమాచారం. 

ALSO READ:శ్రీదేవి పెళ్లి ఆ హీరోతో అనుకున్నారు

ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్(Priyanka mohan) నటిస్తుండగా.. తమిళ నటుడు అర్జున్ దాస్(Arjun Das), శ్రియ రెడ్డి(Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Raj) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి ఇండస్ట్రీ హిట్‌ తరువాత దానయ్య(Daanayya) నిర్మిస్తున్న ఈ సినిమాకు.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.