
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను(Bhonikapoor) ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె తల్లి మాత్రం ఆమెను ఓ తెలుగు హీరోకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడు మురళీ మోహన్(Murali Mohan). ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన గుణగణాలు, సౌమ్యంగా ఉండే తీరు చూసి తనను అల్లుడిగా చేసుకోవాలని ఆమె భావించారట.
ALSO READ:ఆకట్టుకుంటున్న కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్
అక్కినేని నాగేశ్వరరావు(Akkineni NageshvaraRao) తనను శ్రీరామ చంద్రుడు అని పిలిచేవారన్నారు. అలా ఆయన ద్వారా తన విషయాలను ఆమె వాకబు చేశారట. ఆ విషయం సన్నిహితుల ద్వారా తనకు తెలిసిందని మురళీ మోహన్ తెలిపారు. ఈ గ్యాప్‌లో ఏమైందో తెలియదు గానీ, శ్రీదేవి అమ్మగారిని కలిసినప్పుడు ఆ ప్రస్తావన తన దగ్గర తేలేదని అన్నారు.
నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటే శ్రీదేవి జీవితం ఇంకోలా ఉండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.