ఉపాధి హామీ నిధుల మళ్లింపుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రం నోటీసులు

ఉపాధి హామీ నిధుల మళ్లింపుపై రాష్ట్ర సర్కార్కు కేంద్రం నోటీసులు

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను నవంబర్ 30లోపు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. లేదంటే తదుపరి వాయిదాలను నిలిపివేసే అవకాశం ఉంది. 

గత జూన్లో కేంద్ర బృందాలు తెలంగాణను సందర్శించి.. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించాయి. ఉపాధి హామీ పథకం అమలులో పనుల కేటాయింపులలో పలు అవకతవకలు జరిగాయని నిర్ధారించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.