బీసీలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి దాసు సురేశ్ విజ్ఞప్తి

బీసీలను పట్టించుకోండి.. ప్రధాని మోదీకి దాసు సురేశ్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ప్రధాని మోదీ తొలిసారి వరంగల్​కు రావడాన్ని స్వాగతిస్తున్నామని.. అయితే మోదీ హయాంలో బీసీలు అవకాశాలు కోల్పోతున్నారని, దీనిపై నిలదీయడానికీ వెనుకాడబోమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. బీసీల కు రాజకీయ అవకాశాలను కల్పించడంలో ప్రధాని శ్రద్ధపెట్టాలని ఆయన శనివారం ఓ ప్రకటనలో కోరారు. చట్టసభల్లో బీసీల రిజ ర్వేషన్లకు సంబంధించి మోదీ ఒక చిన్న రా జ్యాంగ సవరణ కూడా చేయకపోవడం బాధాకరమన్నారు.

బీసీలు పార్లమెంటులో అడుగుపెట్టాలని అనుకుంటున్నా రని అన్నారు. బీసీల జనాభా లెక్కింపు చేపడతామని 2018లో నాటి హోంమంత్రి రాజ్​నాథ్​తో ప్రకటన చే యించారని, కానీ ఇప్పటికీ ఆ విషయంలో కేం ద్రం ముందడుగు వేయడంలేదన్నారు. క్రీమీలేయర్​ పరిమితిని రూ.8 లక్షలు పెట్టడం వల్ల బీసీ ఉద్యోగులు, వారి పిల్లలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిమితిని రూ.15 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.