పాత బిల్లులిద్దాం.. కొత్త పనులు చేద్దాం.. సాగర్ బైపోల్ కోసం రూలింగ్ పార్టీ ప్లాన్

పాత బిల్లులిద్దాం.. కొత్త పనులు చేద్దాం.. సాగర్ బైపోల్ కోసం రూలింగ్ పార్టీ ప్లాన్

నాగార్జునసాగర్ బైపోల్‌లో గెలిచేందుకు రూలింగ్ పార్టీ ప్లాన్

త్వరలోనే పంచాయతీలకు రూ.16.62 కోట్ల ఈజీఎస్ ఫండ్స్
సబ్ స్టేషన్ల, కమ్యూనిటీ భవనాల మంజూరుకు చర్యలు
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పెండింగ్ అప్లికేషన్లపై ఫోకస్

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్​ బైపోల్​లో గట్టెక్కేందుకు రూలింగ్​ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. డెవలప్​మెంట్, వెల్ఫేర్​ వ్యూహాన్ని  అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా పాత హామీలను నెరవేర్చే క్రమంలో సర్క్యులర్స్​ ఇవ్వడంతో పాటు, కొత్త వాటికి ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. వీటిన్నింటి కంటే ముందు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షే మ పథకాలకు సంబంధించిన బకాయిలను క్లియర్​ చేసే పనిలో పడ్డారు. .

ఈజీఎస్ ​బిల్లులకు మోక్షం

దుబ్బాక బైపోల్​లో ఎలక్షన్​ నోటిఫికేషన్​ ఇవ్వడానికి ముందే నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న పింఛన్లు, కరెంట్​కనెక్షన్లు, ఉపాధి బిల్లుల చెల్లింపులు పూర్తి చేశారు. ఇదే ఎత్తుగడ సాగర్​లో కూడా అమలు చేయాలని రూలింగ్​ పార్టీ ప్లాన్​ చేస్తోంది. ఇప్పటికే 2018 ఎన్నికల నాటి హామీలకు ఆర్డర్లు ఇచ్చిన సర్కారు, దీని తర్వాత రెండో ఫేజ్​లో బిల్లుల చెల్లింపు చేయాలని ఆలోచిస్తోంది. నాగార్జునసాగర్​ నియోజకవర్గంలో పనులు జరిగి పెండింగ్​లో ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం ఫండ్స్​రిలీజ్​ చేయాలని అనుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటివరకు రూ.84.15 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీంట్లో నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోనే రూ.16.62 కోట్లు పెండింగ్​ ఉన్నాయి.

సర్కారుపై వ్యతిరేకత కప్పిపుచ్చేందుకు..

ఉపాధి నిధులతో గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్​ యార్డులు, సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, సోక్​పిట్లు, డ్రైయింగ్​ ప్లాట్​ఫాం లు నిర్మించారు. కానీ ఇప్పటివరకు సర్కారు నిధులు ఇవ్వకపోవడంతో సర్పంచ్​లు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పనులు చేపట్టడంతో బిల్లులు రాక సర్పంచ్​లు, కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగార్జునసాగర్​ బైపోల్​లో గ్రామస్థాయిలో సర్పంచ్​ల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఫండ్స్​రిలీజ్​ చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం లేదు. వీటితో పాటు షాదీ ముబారక్​, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు కూడా ప్రతి మండలంలో పెండింగ్​లో ఉన్నాయి. వీటిన్నింటికి ఎలక్షన్​నోటిఫికేషన్​రాకముందే పేమెంట్స్​ చేయాలని సర్కారు భావిస్తోంది. అయితే ఈ నియోజకవర్గంలో యాదవ ఓటర్లు ఎక్కువగా ఉన్నా రు. సబ్సిడీ గొర్రెలకు సంబంధించి 790 యూనిట్లకు అప్లికేషన్స్​ పెండింగ్​లో ఉన్నాయి. వీటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాల్సి ఉంది.

కొత్త స్కీంలకు ప్రపోజల్స్​

తాగు, సాగు నీటికి సంబంధించి కొత్త స్కీంలకు ప్రపోజల్స్​రెడీ చేస్తున్నా రు. అవసరమైనచోట కొత్తగా సబ్​స్టేషన్​లు మంజూరు చేయడం, విద్యుత్​ స్తంభాలు ఇవ్వడం, కమ్యూనిటీ భవనాలు వంటి వివిధ రకాల కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. పార్టీ లీడర్లతో మండలాల వారీగా మీటిం గ్​లు ఏర్పాటు చేసి పెండింగ్​వర్క్స్​తో పాటు, కొత్త వరాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

For More News..

సంగమేశ్వరం పూర్తయితే శ్రీశైలం ప్రాజెక్టు ఎండిపోతది

కస్టమ్స్‌‌ ఆఫీసర్ల కస్టడీ నుంచి రూ.1.10 కోట్ల విలువైన బంగారం గాయబ్

కరోనా నాశనానికి.. 33 డిగ్రీలు.. 30 నిమిషాలు!

ఓఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకానికి పీఎం ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌