
పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక’. విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డి, హిమజ, శ్యామల ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. జూన్ 30న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘సాయో నారా.. ఇన్నాళ్ల సోలో కలలకు సాయోనారా.. సాయోనారా అంటోంది బ్యాచిలర్ లైఫ్ మనసారా..’ అంటూ సాగే పాటలో పాయల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. మోడర్న్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తున్న ఆమె యూత్‌ని అట్రాక్ట్ చేసేలా డ్యాన్స్ మూమెంట్స్ చేసింది. గుణ బాలసుబ్రహ్మణ్యం పాటను కంపోజ్ చేయగా, శ్రీమణి లిరిక్స్ రాశాడు. హారిక నారాయణ్ పాడింది. మనిషి జీవితంలో సెల్ ఫోన్ కూడా ఒక భాగమైపోవడంతో.. అలాంటి స్మార్ట్ ఫోన్ కథే ఈ సినిమా కాన్సెప్ట్.