పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌..... పేటీఎంలో కొత్త ఫీచర్

పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌..... పేటీఎంలో కొత్త ఫీచర్

పేటీఎం యాప్‌కు కొత్తగా ‘పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌’  అనే ఫీచర్‌ను యాడ్ చేసింది. స్పెసిఫిక్‌ కాంటాక్ట్స్‌కి తరచుగా పేమెంట్స్‌ చేసే వ్యక్తులకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రస్తుతం ఇండియా  డిజిటల్  బాటలో పయనిస్తోంది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ మారుమూల ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలు సులభతరమయ్యాయి. ఇందుకు కారణం UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) పేమెంట్స్‌ అని చెప్పుకోవచ్చు. కరోనా మహమ్మారి తర్వాత క్యాష్‌లెస్‌ ట్రాన్సాక్షన్‌ల అవసరం పెరిగింది. ఈ క్రమంలో పేమెంట్ యాప్స్ పాపులర్ అయ్యాయి. అయితే దేశంలో మొదటి తరం పేమెంట్ యాప్‌గా గుర్తింపు పొందిన పేటీఎం (Paytm), ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. అదేంటి, దాని ప్రయోజనాలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం.

పేటీఎం యాప్‌కు కొత్తగా పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌ అనే ఫీచర్‌నుయాడ్ చేసింది.స్పెసిఫిక్‌ కాంటాక్ట్స్‌కి తరచుగా పేమెంట్స్‌ చేసే వ్యక్తులకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే యూజర్ పిన్ చేసిన ప్రొఫైల్ ఎల్లప్పుడూ టాప్‌లో కనిపిస్తుంది. కాబట్టి పేమెంట్స్‌ త్వరగా, సులభంగా చేయవచ్చు. అయితే ప్రస్తుతం టాప్‌లో ఐదు కాంటాక్ట్స్‌ను మాత్రమే పిన్ చేయవచ్చు. భవిష్యత్తులో పేటీఎం ఈ లిమిట్‌ను పెంచుతుందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఫీచర్‌ వివరాలను తెలియజేస్తూ పేటీఎం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు

ప్రముఖ మొబైల్ పేమెంట్‌ యాప్‌గా తన స్థానాన్ని కొనసాగించేందుకు పేటీఎం నిరంతరం కొత్త ఫీచర్లను విడుదల చేస్తుందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. పిన్ కాంటాక్ట్ ఫీచర్ ద్వారా పేటీఎం వినియోగదారులు వేగంగా ట్రాన్సాక్షన్‌లు చేయవచ్చని వివరించారు. వినియోగదారులు ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి ఫోన్‌లో లేటెస్ట్‌ పేటీఎం యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

పిన్‌ రీసెంట్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ ఎలా యూజ్‌ చేయాలి?

*  UPI మనీ ట్రాన్స్‌ఫర్‌లో ‘టూ మొబైల్‌’ లేదా ‘కాంటాక్ట్’పై క్లిక్‌ చేయండి
*  ఐకాన్స్‌ లేదా సెర్చ్‌ రిజల్ట్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేయండి.
*  చివరగా ‘పిన్‌’పై క్లిక్ చేయండి.
*  ఈ స్టెప్స్‌ ఫాలో అయితే, పేటీఎం యాప్‌లోని కొత్త 'పిన్ రీసెంట్ పేమెంట్స్' ఫీచర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది UPI పేమెంట్స్‌ను మరింత సౌకర్యవంతంగా,        సమర్థవంతంగా చేస్తుంది.

 ఎకానమీలో పేటీఎం పాత్ర

ఇండియా ఎకానమీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (MSMEలు) కీలక పాత్ర పోషిస్తున్నాయి. MSME రంగం భారతదేశ GDPకి దాదాపు 30%, దాని ఎగుమతులకు 50% కాంట్రిబ్యూట్‌ చేస్తోంది. భారతదేశంలో డిజిటల్ విప్లవం MSMEల అభివృద్ధికి సపోర్ట్‌ చేసింది. ఇందులో పేటీఎం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇండియన్‌ మల్టినేషనల్‌ ఫైనాన్సియల్‌ టెక్నాలజీ కంపెనీ పేటీఎం డిజిటల్ పేమెంట్స్‌, ఫైనాన్షియల్‌ సర్వీసులు అందిస్తుంది. తాజాగా పేటీఎం UPI పేమెంట్స్‌ను వేగవంతం చేయడానికి అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌ను తీసుకొచ్చింది.