paytm పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్పై ఆంక్షలు : ఈ సేవలకు బ్రేక్

paytm పేమెంట్స్ బ్యాంక్, వ్యాలెట్పై ఆంక్షలు : ఈ సేవలకు బ్రేక్

పేటీఎంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించింది. ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత పేటీఎం సర్వీసులకు బ్రేక్ వేసింది. ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలు, ఆంక్షలతో.. పేటీఎం యాప్ లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, పేటీఎం వ్యాలెట్ సేవలు 2024, ఫిబ్రవరి 29వ తేదీ తర్వాత పని చేయవు. మిగతా లావాదేవీలు అన్నీ యధావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఆంక్షలు విధించింది. బుధవారం(జనవరి 31)  విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, వాలెట్, ఫాస్ట్ ట్యాగ్ వంటి ప్రీపెయిడ్ ఆప్షన్లనుంచి డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్స్ కు అనుమతి లేదని ఆర్బీఐ తెలిపింది. 

ఆర్​బీఐ  సిస్టమ్ ఆడిట్ నివేదిక,  ఎక్స్​టర్నల్​ ఆడిటర్‌ కాంప్లయన్స్​వాలిడేషన్​ రిపోర్ట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్​బ్యాంక్​ తెలిపింది. ​పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్​)లో నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించామని పేర్కొంది.  అయితే, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు వంటి వారి ఖాతాల నుంచి కస్టమర్లు తమ  బ్యాలెన్స్‌లను ఉపసంహరించుకోవచ్చు. ఎప్పట్లాగే వాడుకోవచ్చు. ఇదిలా ఉంటే,  కొత్త కస్టమర్‌లను తీసుకోవడాన్ని తక్షణమే ఆపివేయాలని పీపీబీఎల్​ని ఆర్​బీఐ గత మార్చిలో ఆదేశించింది.