ఇకనుంచి ఆ పేటీఎం వాలెట్లు బంద్​

ఇకనుంచి ఆ పేటీఎం వాలెట్లు బంద్​

గత ఏడాది కాలంలో ఎటువంటి ట్రాన్సాక్షన్లు జరగని, జీరో బ్యాలెన్స్ ఉన్న  వాలెట్లను క్లోజ్ చేస్తామని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్  ప్రకటించింది. సంబంధిత కస్టమర్లకు త్వరలో తెలియజేస్తామని, వాలెట్లను క్లోజ్ చేసే ముందు 30 రోజుల గ్రేస్‌‌‌‌‌‌‌‌ పీరియడ్ ఇస్తామని తెలిపింది. పేటీఎం పేమెంట్స్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ కొత్త అకౌంట్లు లేదా వాలెట్లు  ఓపెన్ చేయడంపై ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ రిస్ట్రిక్షన్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 15 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్  సర్వీస్‌‌‌‌‌‌‌‌లు ఆగిపోయాయి. కానీ, ఇప్పటికే అకౌంట్లు లేదా వాలెట్లలో ఉన్న ఫండ్స్‌‌‌‌‌‌‌‌ను విత్‌‌‌‌‌‌‌‌డ్రా చేసుకోవడంపై ఎటువంటి రిస్ట్రిక్షన్లు లేవని పేటీఎం తెలిపింది.