PBKS vs RR: టాస్ గెలిచిన రాయల్స్.. ధావ‌న్‌ ఔట్

PBKS vs RR:  టాస్ గెలిచిన రాయల్స్.. ధావ‌న్‌ ఔట్

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 13) మరో ఆసక్తికర సమరం జరగనుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను.. ఎనిమిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ ఢీకొంటోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖ‌ర్ ధావ‌న్ ఆడ‌ట్లేదు.. కెప్టెన్‌గా సామ్ కరణ్ వ్యవహరిస్తున్నాడు. ధావ‌న్‌కు గాయమని సాకులు చెప్తున్నా.. ఫామ్‌లో లేకపోవడం వల్లే అతనిపై వేటు పడిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

తుది జట్లు 

పంజాబ్ కింగ్స్: అథర్వ తైడే, జానీ బెయిర్‌స్టో, ప్రబ్సిమ్రాన్ సింగ్, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్షదీప్ సింగ్.

రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్/ వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, తనుష్ కోట్యాన్, కేశవ్ మహరాజ్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్.