PBKS vs SRH: టాస్ గెలిచిన పంజాబ్.. మార్పులు లేకుండా బరిలోకి సన్‌రైజర్స్

PBKS vs SRH: టాస్ గెలిచిన పంజాబ్.. మార్పులు లేకుండా బరిలోకి సన్‌రైజర్స్

ప్రస్తుత ఐపీఎల్ 17వ ఎడిషన్‌లో పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు.. నేడు(ఏప్రిల్ 9) మరో సమరానికి సిద్ధమైంది. ముల్లన్‌పూర్‌ వేదికగా బలమైన పంజాబ్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ సారథి శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాట్ కమ్మిన్స్ సేన మొదట బ్యాటింగ్ చేయనుంది. 

నిజానికి సన్‌రైజర్స్ జట్టు ప్రదర్శన.. గతానికి భిన్నంగా ఏమీ లేదు. పాత ఆనవాయితీనే కొనసాగిస్తున్నారు. గెలుపోటముల్లో సమంగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకూ 4 మ్యాచ్‌లు ఆడగా.. రెండింట ఓటమిపాలై.. మరో రెండింట గెలుపొందారు. మరోవైపు, పంజాబ్ పరిస్థితి అంతే. దీంతో సమజ్జీవుల పోరు హోరాహోరీగా సాగనుంది.

తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి,  పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనద్కత్.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, సికందర్ రజా, శశాంక్ సింగ్, ఆశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్షదీప్ సింగ్.