ఆడనని మెండికేసిన హారిస్ రౌఫ్.. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు ప్రకటన

ఆడనని మెండికేసిన హారిస్ రౌఫ్.. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టు ప్రకటన

డిసెంబర్ 14 నుండి ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) జట్టును ప్రకటించింది. వెటరన్ బ్యాటర్ షాన్ మసూద్ నాయకత్వంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్‌ సైమ్ అయూబ్‌, పేసర్ ఖుర్రం షాజాద్‌ ఈ సిరీస్‌తో పాక్ తరుపున టెస్టుల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

ఆడనని మెండికేసిన హారిస్ రౌఫ్

ఇదిలావుంటే, పాక్ స్పీడ్ స్టర్ హారిస్ రౌఫ్ ఆస్ట్రేలియా పర్యటనకు నిరాకరించినట్లు చీఫ్ సెలెక్టర్ వహాబ్ రియాజ్ వెల్లడించాడు. మొదట ఆడటానికి అంగీకరించినప్పటికీ.. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడని తెలిపాడు.  కాగా,  వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో బాబర్‌ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అతని స్థానంలో పీసీబీ పాకిస్తాన్‌ టెస్టు కెప్టెన్‌గా మసూద్‌‌ను నియమించింది.  కెప్టెన్‌గా అతని ప్రయాణం ఈ సిరీస్‌తో ప్రారంభం కానుంది.

పాకిస్తాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్‌), సయీమ్ అయూబ్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఇమామ్-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌ కీప), సల్మాన్ అలీ అఘా, మహ్మద్ వసీం జూనియర్, మీర్ హమ్జా, ఖుర్రం షాజాద్ హసన్ అలీ, షాహీన్ షా ఆఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, సౌద్ షకీల్.

ఆస్ట్రేలియా vs పాకిస్థాన్ టెస్టు సిరీస్ షెడ్యూల్

  • ఫస్ట్ టెస్ట్ (డిసెంబర్ 14-18): పెర్త్ స్టేడియం, పెర్త్
  • రెండో టెస్ట్ (డిసెంబర్ 26- 30): మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్బోర్న్
  • మూడో టెస్ట్ (జనవరి 3- 7): సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ