ODI World Cup 2023: మనసు దోచేశాడు: ఫకర్ జమాన్‌కు పాక్ క్రికెట్ బోర్డు స్పెషల్ రివార్డు

ODI World Cup 2023: మనసు దోచేశాడు: ఫకర్ జమాన్‌కు పాక్ క్రికెట్ బోర్డు స్పెషల్ రివార్డు

వరల్డ్ కప్ లో పాకిస్థాన్ సెమీస్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది. సెమీస్ రేస్ లో ఉండాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పై గెలిచింది. కివీస్ తో జరిగిన మ్యాచ్ లోనైతే 402 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో విజయం సాధించారు. కీలకమైన ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఫకర్ జమాన్ మెరుపు సెంచరీతో పాక్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.

63 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ పాక్ ఓపెనర్ 81 బంతుల్లో 126 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ లో 11 సిక్సులతో పాటు 8 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో పాక్ ఒక్కసారిగా సెమీ ఫైనల్ రేస్ లోకి దూసుకొచ్చింది. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) మేనేజ్‌మెంట్ కమిటీ బోర్డు ఛైర్మన్ జాకా అష్రఫ్.. ఫకర్ జమాన్ కు  రూ.1,000,000 (Rs1 మిలియన్) ప్రైజ్ మనీ ప్రకటించారు. ఈ ఇన్నింగ్స్ అనంతరం పాక్ ఓపెనర్ కు ఫోన్ చేసి ఫకర్ జమాన్  ప్రశంసించడం విశేషం. వరల్డ్ కప్ లో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపాడు. 

ఈ మ్యాచ్ లో 402 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ 21.3 (160/1) ఓవర్ల వద్ద ఉన్నపుడు మొదటిసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు ఆటను కొద్దిసేపు నిలిపేశారు. కొద్దిసేపటి తరువాత తిరిగి ఆట ప్రారంభం కాగా, పాకిస్తాన్ టార్గెట్‌ను 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్ణయించారు. అనంతరం 25.3(200/1) ఓవర్ల వద్ద మరోసారి వర్షం మొదలైంది. ఆపై ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. పాకిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. ఆట నిలిచిపోయే సమయానికి ఫఖర్ జమాన్‌ (106 నాటౌట్; 69 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) బాబర్ అజామ్ (47 నాటౌట్; 51 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.   

ALSO  READ : ODI World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న భారత్.. కీలక మార్పుతో సౌత్ ఆఫ్రికా