
మతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుందుకు బీసీసీఐ తమకు భారీ నష్టపరిహారం చెల్లించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి ల్ (ICC) వివాద పరిష్కార కమిటీకి ఫిర్యాదు చేసిన పాకిస్థా న్ క్రికెట్ బోర్డు(PCB)కు షాక్ తగిలిం ది. మీకు చెల్లించాల్సిన పరిహారం విషయం పక్కన పెట్టి.. ముందు కేసు వేసినందుకు లీగల్ ఫీజు, ట్రావెలింగ్ ఖర్చుల కింద బీసీసీఐకి 1.6 మిలియన్ డాలర్లు చెల్లించమని కమిటీ పీసీబీని ఆదేశించిం ది. దీంతో పాక్ బోర్డు సోమవారం సుమారు రూ. 10.9 కోట్లు ఇండియా బోర్డుకు జరిమానా కింద చెల్లించింది. ఎమ్‌ఓయూ ప్రకారం 2015నుంచి 2023 మధ్య ఇరు దేశాల నడుమ 6 ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సిం ది. కానీ కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలపకపోవడంతో పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడేందుకు ఇండియా బోర్డు నిరాకరించింది. ఈ అంశంపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పీసీబీకి అక్కడ కూడా చుక్కెదురైంది.నష్ట పరిహారం కేసులో మేము సుమారు 2.2 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాం . మా కేసును ఐసీసీ కమిటీ అంగీకరించిం ది. పరిహారం కిం ద ఇండియాకు సుమారు 1.6 మిలియన్ డాలర్లు చెల్లించమని ఆదేశించిం ది అని పీసీబీ చైర్మన్ ఎహ్ సాన్ మనీ తెలిపారు. 70 మిలియన్ల డాలర్లు (సుమారు రూ. 480 కోట్లు) బీసీసీఐ నుంచి ఆశించిన పాక్ .. చివరకు 1.6 మిలయన్ డాలర్లు ఎదురు కట్టింది.