తప్పు ఒప్పుకున్న కేటీఆర్ రాజీనామా చెయ్

తప్పు ఒప్పుకున్న కేటీఆర్ రాజీనామా చెయ్

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఒళ్ళు వంచి పని చేయరని కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. దుబాయ్ అభివృద్ధిలో తెలంగాణ బిడ్డల కృషి ఉందని కేటీఆర్  గమనించాలని మధుయాష్కి అన్నారు. మణికొండ ఘటనలో తప్పు తనదేనని ఒప్పుకున్న కేటీఆర్..  మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించారు. కేటీఆర్ తప్పిదం వల్లే ఓ ఐటీ ఉద్యోగి చనిపోయారని మధుయాష్కీ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘మురికి కాలువల మంత్రి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. కష్టించి పని చేసే అలవాటు ఆయనకు లేక పోవచ్చు కానీ తెలంగాణ బిడ్డలు కష్టించి పనిచేస్తారు. బొగ్గు గనుల్లో, ముంబయి కర్మాగారాల్లో పని చేస్తుంది మన వాళ్ళే. దుబాయ్ అభివృద్ధిలో తెలంగాణ బిడ్డల కృషి ఉంది. త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఏడేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారు. ఊసరవెల్లి లాగా కేసీఆర్ రంగులు మారుస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో కూల్చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం దుర్మార్గం. ఉద్యోగాల నోటిఫికేషన్ వేయక 40 వేల మందికి ఏజ్ లిమిట్ కూడా అయిపోయింది. నిరుద్యోగ సైరన్‌కి వచ్చే వారి అరెస్టులు ఖండిస్తున్నాం. అరెస్టులు మీ నిరంకుశ విధానానికి నిదర్శనం. పోలీసులు అధికార పార్టీ గుండాలుగా మారిపోయారు. పోలీసు బలగాలతో అణచివేస్తే ఉద్యమం ఇంకా ఎగిసిపడుతుంది. అనుమతి నిరాకరించినా ఉద్యమం మాత్రం ఆగదు. లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదం జరిగితే రాజీనామా చేశారు. మణికొండ ఘటనలో నువ్వెందుకు రాజీనామ చేయవు కేటీఆర్. తప్పు నాదే అని ఒప్పుకున్నప్పుడు రాజీనామ చెయ్. నీ శాఖ తప్పిదం వల్ల ఓ ఐటీ ఉద్యోగి చనిపోయారు. నీ మీద క్రిమినల్ కేసు బుక్ చేయాలి. కేటీఆర్ రాజీనామా చేయాలి. గులాబీ పార్టీ నేతలు బీజేపీకి గులాంగా మారారు. కేసీఆర్ తెలంగాణను ఢిల్లీలో తాకట్టుపెట్టిండు. గండ్ర వెంకటరమణ నీకు సిగ్గుశరం ఉంటే.. ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ బిక్ష వల్లే నువ్వు ఆ స్థితిలో ఉన్నావు’ అని మధుయాష్కి అన్నారు.

For More News..

‘మా’ ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్

నోటిఫికేషన్లు ఇయ్యకుండా జాబ్ మేళా డ్రామాలేంటి?

రాంగ్‎రూట్‎లో కేటీఆర్ కారు.. అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్సై