హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును బుధవారం పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పరామర్శించారు. హరీశ్ రావు తండ్రి చనిపోవడంతో సానుభూతి ప్రకటించారు. కోకాపేటలోని ఆయన నివాసానికి వెళ్లిన పీసీసీ చీఫ్.. హరీశ్ తండ్రి సత్యనారాయణ రావు ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్ రావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను మహేశ్ గౌడ్ పరామర్శించారు. పీసీసీ చీఫ్ వెంట కాంగ్రెస్ నేతలు మధు యాష్కీ, బెల్లయ్య నాయక్ తదితరులు ఉన్నారు.
