జులై 25న ఢిల్లీలో ఓబీసీ మహా సమ్మేళనం : పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్

జులై 25న ఢిల్లీలో ఓబీసీ మహా సమ్మేళనం : పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయ సాధన కోసం కాంగ్రెస్ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 25న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న ‘భాగీదారీ న్యాయ సమ్మేళనం’ ప్రోగ్రాంకు తెలంగాణ నుంచి బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. గాంధీ, పూలే కలలను సాకారం చేసే దిశగా జరగనున్న ఈ సమ్మేళనంలో పాల్గొనాలనుకునే వారు మీ జిల్లా నుంచి పేరు నమోదు చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 

లేదంటే ఈ ప్రోగ్రాంకు అనుమతించరని తెలిపారు. ఈ సమ్మేళనం దేశంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది కాబోతుందని, ఈ చారిత్రక ఘట్టానికి మీరు సాక్ష్యంగా నిలిచేందుకు ముందుగానే మీ పేరు నమోదు చేసుకొని పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

అచ్యుతానందన్ మృతిపై సంతాపం

కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ మృతిపై ​మహేశ్ గౌడ్ సంతాపాన్ని ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శతాధిక కమ్యూనిస్టు నేత అచ్యుతానందన్ మరణం జాతీయ రాజకీయాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.