కేసీఆర్‌ను నమ్మి ఇళ్లు కూలగొట్టిన్రు..

కేసీఆర్‌ను నమ్మి ఇళ్లు కూలగొట్టిన్రు..

కేసీఆర్ మాటలకు మోసపోయి.. దత్తత గ్రామాల్లో చాలా మంది ఇండ్లు కూలగొట్టుకున్నారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆడ పిల్లలు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. దత్తత గ్రామాల్లో ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉందన్నారు తన ఫాంహౌస్ కు రూట్ క్లియర్ కోసమే కేసీఆర్ దత్తత పేరుతో డ్రామాలని ఆడారని విమర్శించారు. కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఒక్కటైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు రేవంత్.  కేసీఆర్ దత్తత ఊళ్లకు ఏం చేశారో చెబితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు.  దత్తత గ్రామాల్లో ఏం చేయలేనోడు..రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు రేవంత్. ధనిక రాష్ట్రం ఐతే.. సక్కగా జీతాలు ఎందుకు ఇస్తలేరన్నారు రేవంత్.

లక్ష్మాపూర్ గ్రామంలో ధరణి వెబ్ సైట్ ప్రారంభించారని.. ఆ ఊరే ధరణి వైబ్ సైట్ లో లేదన్నారు. చిన్న ముల్కనూర్ లో ఉన్న ఇండ్లు కూలగొట్టారన్నారు రేవంత్. కేసీఆర్ నియోజకవర్గం గజ్వెల్ కు వెళ్తానన్నారు. ఎవరు అడ్డొస్తారో చూస్తామని సవాల్ చేశారు. సీఎం దత్తత గ్రామం మూడుచింతలపల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షలో మాట్లాడారు రేవంత్. 10లక్షలు ఇచ్చి.. ఇంటిమీద టీఆరెస్ జెండా, ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలని అంటే చిత్తకొట్టాలన్నారు. కేసీఆర్ 10లక్షలు ఇవ్వడని.. ఇస్తే తీసుకొని కేసీఆర్ కు సరైన బుద్ది చెప్పాలన్నారు.