
హైదరాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేద్దామని, ఆత్మహత్యలు చేసుకోవద్దని వీఆర్ఏలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. వీఆర్‌ఏల ఉద్యమానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పేస్కేల్ అమలు చేయడం లేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న అశోక్ కుటుంబ సభ్యులతో, వీఆర్ఏ సంఘ నేతలతో రేవంత్ ఫోన్లో మాట్లాడారు. వీఆర్ఏ సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాట్లాడి అసెంబ్లీలో చర్చించేలా కృషి చేస్తానన్నారు. కేసీఆర్‌కు వీఆర్‌ఏల సమస్యలపై లేఖ రాస్తాననన్నారు. ఇప్పటివరకు 22 మంది వీఆర్‌ఏ లు చనిపోయారని గుర్తు చేశారు.