
తెలంగాణ వస్తే అన్ని వర్గాలు సంతోషం గా ఉంటాయని అనుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ బరితెగించి వ్యవరిస్తున్నారని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ లాంటి నేతను తన ఎక్స్ పీరియన్స్ లో చూడలేదన్నారు.
నిజమాబాద్ పార్లమెంట్ ప్రజల తీర్పులో ఓడిపోయిన కవిత ను ఎమ్మెల్సీగా నిలబెట్టారని ఆరోపించారు. కరోన టైం లో మాత్రం ప్రతి పక్షాలు మాత్రం సమావేశాలు పెట్టుకోవద్దట…కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం సమావేశాలు పెట్టుకోవచ్చట. క్యాంప్ లో ఏర్పాటు చేసుకోవచ్చట.. ఎంపీటీసీలను సంతలో పశువులను కొన్నట్లుగా కొంటున్నారని విమర్శించారు.
పార్టీల వారిగా జాబితా ప్రకటించి కొంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడివి..? ఆ సొమ్ము ఎవరిది..? రాజకీయాల్ని కేసీఆర్ కమర్షియల్ గా మార్చారని, టీఆర్ఎస్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్ధి కవితను డిస్ క్వాలిఫై చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ను కోరుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.