సోయగాలతో మెస్మరైజ్ చేస్తున్న.. కొరిటికల్ జలపాతం..సందర్శకుల రద్దీ

సోయగాలతో మెస్మరైజ్ చేస్తున్న.. కొరిటికల్ జలపాతం..సందర్శకుల రద్దీ

ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ప్రముఖ కోరిటికల్ జలపాతం మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. పర్వతాల మధ్య నుంచి ఉప్పొంగి పడుతున్న జలపాతం అపూర్వ సోయగాన్ని సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తోంది. పచ్చని అరణ్యాలు, పర్వతాల నడుమ సుడిగుండంలా కిందకు దూసుకుపోతున్న జలప్రవాహం చూసి సందర్శకులు మురిసిపోతున్నారు.

పర్యాటకుల రద్దీ

వీకెండ్‌ కావడంతో పాటు వర్షాకాలం అందాలను ఆస్వాదించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం చుట్టుపక్కల ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందర్శకులు ముచ్చటపడుతున్నారు. ఫ్యామిలీలు, యువత, పిల్లలు కలిసి ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ సందడి చేస్తున్నారు.

 ప్రకృతి అందాలు అదుర్స్..

గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కోరిటికల్ జలపాతంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీని వల్ల జలపాతం పూర్తిస్థాయిలో కాస్కేడ్లలా కిందకు వర్షం కురిసినట్టుగా పడుతూ కనులవిందు చేస్తోంది. పర్యాటకుల రాకతో అక్కడి వ్యాపారులు, టీ దుకాణాలు, వాహన పార్కింగ్ కేంద్రాలు సందడిగా మారాయి.