ప్రాజెక్టుల నిర్మాణం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి

ప్రాజెక్టుల నిర్మాణం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి

ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం సింగారం దగ్గర మూసీనదిపై రూ. 7.3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను ఉత్తమ్ పరిశీలించారు. గ్రామానికి ఎగువ భాగంలో చెక్ డ్యాం నిర్మించడం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఆయన అన్నారు. కాంట్రాక్టర్, అధికార పార్టీ  నాయకుల స్వలాభం కోసమే చెక్ డ్యాం నిర్మిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చెక్ డ్యాం నిర్మాణ పనులను ఆపేయాలని ఆయన డిమాండ్ చేశారు.