- పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని తేలడంతోనే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పొగరుబోతు మాటలు మాట్లాడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైరయ్యారు. గురువారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.
రాష్ట్ర పోలీసు వ్యవస్థపై కేటీఆర్ మాట్లాడిన మాటలు సరైనవి కావని, వెంటనే తెలంగాణ పోలీసులకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ వాలంటరీ పదవీ విరమణ తీసుకున్నారని, దీన్ని కూడా రాజకీయం చేయడం తగదన్నారు. ఐఏఎస్ లతో కాళ్లు మొక్కించుకొని ఆ వ్యవస్థను అగౌరవపరిచిన మీరు.. ఇప్పుడు రిజ్వీ గురించి మాట్లాడితే తెలంగాణ జనం నవ్వుకుంటున్నారన్నారు.
