ఇసుక మాఫియాకు కేరాఫ్ బీఆర్ఎస్ : పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి

ఇసుక మాఫియాకు కేరాఫ్ బీఆర్ఎస్ : పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి

జమ్మికుంట, వెలుగు: ఇసుక మాఫియాకు కేరాఫ్ ​అడ్రస్​బీఆర్ఎస్​పార్టీ అని పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి ఆరోపించారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శంభునిపల్లిలో చెక్ డ్యామ్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. 

చెక్​డ్యామ్​కూలిన ఘటనపై రెండు, మూడు రోజుల్లో నివేదిక వస్తుందని,  బాధ్యులపై సర్కారు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సుంకరి రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సతీశ్​రెడ్డి, నాయకులు రామారావు, రాజేశ్వర్​రావు, దీక్షిత్, రేణుక తదితరులు పాల్గొన్నారు.