హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కార్ రేసింగ్‌ల వరకు అన్నింటిలోనూ స్కామ్‌లు జరిగాయని పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి ఆరోపించారు. అయితే, తమ ప్రభుత్వ పాలనలో అవినీతే జరగలేదని మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు మాట్లాడుతున్నారని, అధికారులే మో అప్పటి సీఎం కేసీఆర్ చెబితేనే తాము చేశామని అంటున్నారన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. కరెంట్ కొనుగోళ్ల మీద కేసీఆర్‌కు నోటీసులిస్తే వాయిదాలు ఎందుకు అడుతున్నారని ప్రశ్నించారు.
అవినీతి జరగన ప్పుడు, తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌లో కేసీఆర్, కేటీఆర్, కవిత పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లు బీఆర్‌ఎస్ నేతలన్నారు. కాంగ్రెస్ నేత సతీశ్ మాదిగ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి స్కీమ్‌లో ఆ పార్టీ లీడర్లు అవినీతికి పాల్పడ్డారని, అలాంటి వారు తమ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.