ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు నాకు ఇవ్వండి..పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజేందర్రెడ్డి

ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు నాకు ఇవ్వండి..పీసీసీ రాష్ట్ర కార్యదర్శి రాజేందర్రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్​కు కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ  పీసీసీ రాష్ట్ర కార్యదర్శి మరంగంటి రాజేందర్ రెడ్డి శుక్రవారం గాంధీభవన్​లో దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో ఎన్ఎస్ యూఐలో, యువజన కాంగ్రెస్ విభాగంలో రాజేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. లేకపోయినా నిజాయితీగా పనిచేసిన తనకు అవకాశం ఇవ్వాలని రాజేందర్ రెడ్డి హై కమాండ్​ను కోరారు. ఖైరతాబాద్​అసెంబ్లీ సీటు తనకు కేటాయిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ను ఓడించి.. కాంగ్రెస్​ను గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజేందర్​రెడ్డి వెంట కాంగ్రెస్​ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, నాయకులు రమాకాంత్​రెడ్డి, కార్యకర్తలు ఉన్నారు.