మంత్రి మల్లారెడ్డి ఓపెన్ గానే సీట్లు అమ్ముకున్నాడు : నిరంజన్

మంత్రి మల్లారెడ్డి ఓపెన్ గానే సీట్లు అమ్ముకున్నాడు : నిరంజన్

కబ్జా భూముల్లో మంత్రి మల్లారెడ్డి కాలేజీలు కట్టారని కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వైస్ ఛైర్మన్ నిరంజన్ ఆరోపించారు. ఓపెన్ గానే సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే విచారణ ఎందుకని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ దర్యాప్తు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్దారు.

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీని విడటం బాధాకరంగా ఉందన్నారు. గాంధీని చంపిన గాడ్సే పార్టీలో చేరనని చెప్పిన వ్యక్తి.. ఆ పార్టీలోనే చేరతానడం కాంగ్రెస్ పార్టీ విధేయులకు మచ్చలాంటిదని నిరంజన్ అన్నారు.