హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏ నోటిఫికేషన్ విడుదల చేసిందని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఆరోపించారు. దేశంలోని రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం కోసమే నోటిఫి కేషన్ రిలీజ్ చేశారని సోమవారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. సీఏఏకు 2019 లో ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇంత కాలం ఎందుకు సైలెంట్ గా ఉందని ఆయన ప్రశ్నించారు. మనది లౌకిక దేశమని, అన్ని మతాల ప్రజలకు సమాన అవకాశాలు ఉంటాయ న్నారు. ఈ చట్టంతో వివక్ష చూపడం ఎందు కని కేంద్రాన్ని నిలదీశారు. ఇది ఒక మతం ప్రజల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని ఆయన ఆరోపించారు.
