నీట్ 2024 ఫలితాల అవకతవకలపై దర్యాప్తు జరపాలి

నీట్ 2024 ఫలితాల అవకతవకలపై దర్యాప్తు జరపాలి
  •     పీడీఎస్‌యూ డిమాండ్ 

నిజామాబాద్ సిటీ,  వెలుగు :  నీట్ 2024 పరీక్షా ఫలితాల అవకతవకలపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.  నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..  దేశ వ్యాప్తంగా ప్రతినిర్వహించే  నీట్ పరీక్షా ప్రశ్నాపత్రం  లీకై ఫలితాల్లో స్కామ్ జరిగినట్లుగా దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆరోపిస్తున్నారన్నారు.  ఒకే పరీక్షా  కేంద్రంలో ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు.

ఒక్కో పరీక్షా పత్రం లీకేజీలో లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు.  లక్షలాది మంది జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. ఓకే పరీక్షా కేంద్రంలో 67 మందికి టాప్ ర్యాంకులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయని, నీట్ పరీక్షా ఫలితాలు జూన్ 14న విడుదల చేయాల్సింది. కానీ హడావిడిగా ఎన్నికల ఫలితాల రోజే ఎందుకు విడుదల చేశారన్నారు.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ జిల్లా ఉపాధ్యక్షులు కార్తీక్ , దేవిక జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్ ,నాయకులు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.