హైదరాబాద్ లో అడుగుపెట్టిన ‘పెరల్ ఎక్స్ స్టూడియో’

 హైదరాబాద్ లో అడుగుపెట్టిన ‘పెరల్ ఎక్స్ స్టూడియో’

హైదరాబాద్: డిజైన్, ఫ్యాషన్ మరియు మీడియా సంస్థ హైదరాబాద్ సిటీలో ‘పెరల్ ఎక్స్ స్టూడియో’ను ప్రారంభించింది. ప్రదర్శన కళల్లో 40కి పైగా ఫాస్ట్-ట్రాక్ కోర్సులను పెరల్ అకాడమి అందించనుంది. అన్ని వయసుల వారికి ఉపయోగపడేలా కోర్సులను డిజైన్ చేయడం జరిగిందని పెరల్ అకాడమీ ప్రకటించింది. ముఖ్యంగా ‘ఫ్యాషన్ డిజైన్-ఉమెన్స్ వేర్’, ‘స్టైలింగ్ ఫర్ ఇంటీరియర్’, ‘పర్సనల్ స్టైలింగ్ అండ్ ఇమేజింగ్ కన్సల్టెన్సీ’, ‘ఫ్యాషన్ అండ్ సెలబ్రిటీ మేకప్’, ‘పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’, డిజిటల్ ఫిల్మ్ మేకింగ్’ ‘ప్రొఫెషనల్ ఫొటోగ్రఫి’, ‘సోషియల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్’, ‘అడ్వర్‌టైజింగ్ అండ్ గ్రాఫిక్స్’, ‘ప్రొఫెషనల్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పీరియెన్స్ మేనేజ్‌మెంట్’ తదితరాలు ఉన్నాయి. 
హైబ్రిడ్-ఆఫ్‌లైన్/ఆన్‌లైన్ మోడల్‌లో అందిస్తుండగా 3 నెలల కోర్సులు పూర్తి చేసి సర్టిఫికెట్లు తీసుకోవచ్చు. లేదా 12 నెలల వ్యవధికి నాలుగు కోర్సులను కలిపి క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ (ఇండస్ట్రీ ఇంటర్న్‌షిప్) ద్వారా డిప్లమో పట్టా పొందవచ్చు.
ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్సులను కేవలం మూడు నెలల్లో నేర్చుకునేలా డిజైన్ చేశారు. 
పెరల్ అకాడమి అధ్యక్షుడు అదితి శ్రీవాత్సవ ఈ సందర్భంగా మాట్లాడుతూ  రేపటి సృజనశీల వృత్తి నిపుణులను తయారు చేసేందుకే తమ శాఖలను విస్తరిస్తున్నామన్నారు. అన్ని వయసుల వారిలోనూ నైపుణ్యం ఉంటుందని.. వారి ఆసక్తికి తగిన కోర్సులను ఎంపిక చేసుకున్న వారికి సులువగా అర్థమయ్యేలా నేర్పితే వారు తమ కలలను నెరవేర్చుకునే అవకాశం వస్తుందన్నారు. వివిధ వృత్తుల్లో లేదా ఉద్యోగ రంగాల్లో ఉన్న వారు మరింత దృఢంగా నిలదొక్కుకోగలుగుతారని పేర్కాన్నొరు. 
పెరల్ ఎక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో పరిశ్రమలోని ప్రముఖుల్లో ఒకరైన డైరెక్టర్ అశుతోష్ గోవార్కికర్, నిర్మాత, దర్శకుడు కేతన్ దేశాయి, ఫ్యాషన్ డిజైనర్ అంజు మోది, గ్లోబల్ యూనివర్సిటీ సిస్టమ్స్ ఆసియా పసిఫిక్ సీఈఓ శరద్ మెహ్రా, స్కూల్ ఆఫ్ కాంటెంపరరీ మీడియాకు చెందిన డీన్ వివేక్ వాస్వాని, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్‌కు చెందిన డీన్ మౌరిఝియో గ్రియోలీ తదితరులు వృత్తినైపుణ్య శిక్షణ ప్రాముఖ్యత, ఉద్యోగ అవకాశాల భవిష్యత్తు, ప్రతిభ మరియు అర్హతల్లో ఏది ముఖ్యమో వివరించారు.